BHNR: ఆలేరు కాంగ్రెస్లో చిచ్చు పెడితే ఊరుకోబోమని ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంగ కిరణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆలేరులో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల మోటకొండూరులో యూత్ కాంగ్రెస్ నాయకుల సన్మాన సభలో స్థానిక ఎమ్మెల్యే ఫొటో లేకుండా ఫ్లెక్సీ పెట్టారని, కొందరు స్వార్థ రాజకీయాల కోసం పార్టీని బద్నాం చేస్తున్నారని ఆరోపించారు.