KMR: సైబర్ నేరాలకు ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలని పోలీస్ కళాబృందం ప్రతినిధులు సూచించారు. బుధవారం బిక్కనూరు మండల కేంద్రంలో సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై 2 నరేందర్ మాట్లాడుతూ.. సెల్ ఫోనుకు వచ్చే మెసేజ్ లకు స్పందించవద్దని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.