SRCL: జగిత్యాల జిల్లా నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాకు బదిలీపై వచ్చిన జిల్లా విద్యాధికారి బోల్గం జగన్మోహన్ రెడ్డి సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లాలోని వివిధ ఉపాధ్యాయ సంఘం నాయకులతో సమావేశమయ్యారు. జిల్లాలో విద్యారంగ పరిస్థితులు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, ఉపాధ్యాయుల సమస్యలు, తదితర అంశాలను ఉపాధ్యాయ సంఘ నాయకులు.. డీఈఓకు వివరించారు.