గద్వాల పట్టణంలోని బీడి కాలనీకి చెందిన సలీం అనే యువకుడు స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లి గుండాల జలపాతంలో పడి గల్లంతయ్యాడు. గాలం వేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడటంతో ఈ ఘటన జరిగింది. స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి సలీం మృతదేహాన్ని వెలికితీసినట్లు ఎస్సై శ్రీకాంత్ గురువారం తెలిపారు.