MBNR: నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నెలవారి నేర సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణకు సాంకేతిక ఆధారాలతో కూడిన ఆధునిక పద్ధతులు అమలు చేయాలన్నారు. పెండింగ్ కేసుల సంఖ్యా తగ్గించేందుకు అధికారులు చొరవగా చర్యలు తీసుకోవాలన్నారు.