KMM: ములకలపల్లి మండలం రామచంద్రాపురం శివారులోని సీతారామ ప్రాజెక్టు కాలువ వద్ద మిషన్ భగీరథ పైపులైను మరమ్మతుల్లో భాగంగా నీటి సరఫరాలో అంతరాయం ఉండనుంది. అశ్వారావుపేట నియోజకవర్గంలోని చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట మండలాలతో పాటు సత్తుపల్లి మండలానికి గురువారం నుంచి డిసెంబరు 1 వరకు అంతరాయం ఏర్పడుతుందని భగరీథ గ్రిడ్ కార్యానిర్వాహక ఇంజినీర్ నళిని తెలిపారు.