భారత్-చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వెంబడి 1,637కి.మీ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్లోని సరిహద్దు రహదారికి కేంద్రం రూ.28,229 కోట్లు మంజూరు చేసింది. కాగా.. వ్యూహాత్మక కార్యాచరణలో భాగంగా రూ.40 వేల కోట్ల అంచనా వ్యయంతో అరుణాచల్ సరిహద్దు రహదారిని కేంద్రం నిర్మిస్తోంది.