నల్గొండ: కేంద్ర ప్రభుత్వం మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు లేని భారత్ కొరకు “బాల్యవివాహ విముక్తి భారత్”(చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా)కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సందర్బంగా అశ్రీత స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని బాలికలకు బాల్య వివాహల నిర్మూలన పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి దీప్తి మాట్లాడారు.