NGKL: పదర మండలం నల్లమల ప్రాంతానికి చెందిన ప్రముఖ ఇన్సూరెన్స్ నిపుణులు శ్రీను యాదవ్, కర్నాటి శ్రీనివాసులు ప్రతిష్ఠాత్మక ‘గ్రాండ్ స్లామ్ అవార్డు’కు ఎంపికయ్యారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన కార్యక్రమంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్ స్టీవ్ వాగ్ చేతుల మీదుగా వారు ఈ అవార్డును అందుకున్నారు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.