Viral: సీఎం కేసీఆర్ ఫోటోలతో ప్రొద్దుటూరు నుంచి సైకిల్ యాత్ర
తెలంగాణ సీఎం కేసీఆర్ అభిమానంతో ఏపీకి చెందిన ఓ వ్యక్తి సైకిల్ యాత్రను చేపట్టాడు. మట్టితో మోనో కలర్లో సీఎం కేసీఆర్ పెయింటింగ్ వేసి మంత్రి కేటీఆర్ కు అందించారు.
సీఎం కేసీఆర్ (Cm KCR) పట్ల ఏపీకి చెందిన పెయింటర్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రొద్దుటూరుకు చెందిన పెయింటింగ్ ఆర్టిస్ట్ రామాంజనేయ రెడ్డి ఏడు రోజుల పాటు సైకిల్ యాత్రను చేపట్టారు. శుక్రవారం ప్రగతి భవన్ కు వచ్చిన ఆర్టిస్టు బృందాన్ని మంత్రి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. వారికి సిఎం కేసీఆర్ తరపున అభినందనలు తెలిపారు.
రామాంజనేయ రెడ్డి వేసిన పెయింటింగ్స్:
దివ్యాంగుడైన తుపాకుల రామాంజనేయరెడ్డిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రొద్దుటూరు పట్టణం. పట్టువదలకుండా అనుకున్నది సాధిస్తూ, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ వస్తున్న సిఎం కేసీఆర్ అంటే తనకు ఎనలేని అభిమానమని ఈ సందర్భంగా రామాంజనేయరెడ్డి తెలిపారు. తెలంగాణను సాధించడమే కాకుండా అనతి కాలంలోనే అభివృద్ధి పథంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన కేసీఆర్ ఆదర్శవంతమైన నేత అని అన్నారు.
గండికోట మట్టితో మోనో కలర్లో సీఎం కేసీఆర్ పెయింటింగ్ ను తానే స్వయంగా గీశానని రామాంజనేయ రెడ్డి తెలిపారు. వాటిని ప్రత్యేకంగా ఫ్రేములు కట్టించుకోని ప్రొద్దుటూరు నుంచి సైకిల్ యాత్ర ద్వారా 7 రోజుల పాటు ప్రయాణించినట్లు చెప్పారు. తన మిత్రులతో కలిసి హైద్రాబాద్ చేరుకున్నానని, మంత్రి కేటీఆర్ తనని అభినందించినట్లు తెలిపారు.