తెలంగాణ మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy)కి ఎదురు దెబ్బ తగిలిగింది. మేడ్చల్ నియోజకవర్గంలో 11 మంది మాజీ ప్రజా ప్రతినిధులు, ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కి రాజీనామా చేశారు.మంత్రి సోంత నిర్ణయాలతో తాము పార్టీని వీడుతున్నట్లు పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా (Medchal District) శామీర్పేట ముడుచింతలపల్లి మండల మాజీ ప్రజా ప్రతినిధులు, ఉద్యమకారులు నేమురి విష్ణువర్ధన్ రెడ్డి, కంఠం కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాజీనామాలు చేశారు.
ఉమ్మడి శామీర్ పేట (Sameer Peta) మాజీ మండలం అధ్యక్షుడు నేమురి విష్ణువర్ధన్ గౌడ్, అలియాబాద్ మాజీ సర్పంచ్, శామీర్పేట మండలం రైతు బంధు అధ్యక్షుడు కంఠం కృష్ణారెడ్డి, ముడుచింతలపల్లి మండలం రైతుబంధు అధ్యక్షురాలు, లక్ష్మపూర్ మాజీ సర్పచ్ శ్యామల, విష్ణు, చంద్రకళ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు శంబీపూర్ రాజు(Shambipur Raju)కు లేఖ రాశారు. పార్టీ కోసం కష్టపడిన తమను గుర్తించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్(Real estate)వ్యాపారులకు, భూ కబ్జాదారులకు ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. మల్లారెడ్డి ఒంటెద్దు పోకడకు మరికొంతమంది సర్పంచులు, మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు పెద్ద ఎత్తున రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని వారు వెల్లడించారు