MNCL: మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మాజీ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ మాధవరపు నర్సింగరావు అన్నారు. బుధవారం కన్నెపల్లి మండలం టేకులపల్లి గ్రామ పంచాయతీలో గ్రామ సమైక్య భవనానికి భూమి పూజ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికి అండగా నిలుస్తున్నాయని అన్నారు.