NZB: ప్రజా కవి వరంగల్ శ్రీనివాస్ రాసిన ‘నూరేండ్ల నా ఊరు’ గేయ కావ్యం రికార్డింగ్ కోసం ఈ నెల 30న నిజామాబాద్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కళాకారుల ఎంపిక పోటీలు ఉంటాయని గాయకురాలు రేలారేలా గంగ తెలిపారు. ఆయన రాసిన గేయ కావ్యం 243 చరణాలను, 243 మంది కళాకారులతో పాట రికార్డ్ చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కళాకారుల ఎంపిక జరుగుతుందన్నారు.