BHPL: రేగొండ మండల కేంద్రంలోని భూపాలపల్లి-రేగొండ జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఎస్సై సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై పలు వాహనాలను ఆపి డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు చేశారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు మద్యం సేవించకుండా వాహనం నడపాలని సూచించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.