NRML: విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించినందుకుగానూ భైంసా మండలం మహాగాం ZPHS సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు శివరాం జాదవ్‌ను ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం వరించింది. బుధవారం ఈ పురస్కారాన్ని కలెక్టర్ అభిలాష అభినవ్ చేతులమీదుగా అందుకున్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.