NGKL: తెలకపల్లి మండల కేంద్రంలోని ‘కేఫ్ తెలంగాణ’లో పనిచేస్తున్న ఇద్దరు బాల కార్మికులను ఏహెయూ సీఐ శంకర్ బృందం రక్షించింది. అనంతరం వారిని జిల్లా బాలల సంక్షేమ కమిటీ ముందు హాజరుపరిచారు. 18 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.