Kaushik: ప్రచారం ముగిసే రోజు చేసిన కామెంట్స్‌తో పాడి కౌశిక్ రెడ్డిపై (Kaushik) కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో అధికారులతో వాగ్వివాదానికి దిగారని కేసు ఫైల్ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగాచరనే ఆరోపణలతో కేసు పెట్టారు. ఓట్లు లెక్కించే సమయంలో పోలీసులతో డిస్కషన్ చేశాడని.. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొందని అంటున్నారు. ఇది ముమ్మాటికీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం అని అంటున్నారు. పోలింగ్‌కు ముందు తనను గెలిపించకుంటే భార్య, కూతురుతోపాటు ఆత్మహత్యే శరణ్యం అన్నారు. గెలిస్తే విజయయాత్ర.. లేదంటే శవయాత్ర అన్నారు. దీనిపై ఎన్నికల సంఘం సీరియస్ అయి.. కేసు నమోదు చేయాలని పోలీసు శాఖను ఆదేశించింది. ఇప్పుడు మరో కేసు నమోదైంది.