KMM: దివ్యాంగుల వైకల్య పరీక్షలు నిర్వహించి సదరమ్ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ఖమ్మం జనరల్ ఆసుపత్రిలో ఈనెల 18 నుంచి 30 వరకు శిబిరాలు నిర్వహిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ నరేందర్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు శిబిరాలు ఉంటాయని, 18న ఆర్థో, 23న వినికిడి లోపం, 25న దృష్టి లోపం, 30న మానసిక దివ్యాంగులకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.