వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఇవాళ CP సన్ ప్రీత్ సింగ్ మీడియాతో మాట్లాడారు. మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని CP పేర్కొన్నారు. కౌంటింగ్ అనంతరం విజయోత్సవాలు జరపడానికి ఎలాంటి అనుమతి లేదని, అలాంటి వాటికి తప్పనిసరిగా పోలీసు అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.