WGL: చెన్నారావుపేట(M)బోజేరువు గ్రామ పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ జయరాజ్ పనితీరుకు ప్రజలు ‘సెల్యూట్ పోలీస్’ అంటూ మెచ్చుకుంటున్నారు. గ్రామానికి చెందిన ఓ వృద్ధ మహిళ ఓటు వేసేందుకు కష్టపడి వస్తుండగా ఆమెను గమనించిన జయరాజ్, ఆమెను భుజాలపై ఎత్తుకొని పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లారు. ఈ మానవత్వం నిండిన చర్య ప్రజలను ఆకట్టుకుంది.