MDK: హవేలి ఘనాపూర్ మండల కేంద్రంలో వివోఏలు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. కనీస వేతన పెంపు, ఉద్యోగ భద్రత తదితర డిమాండ్లతో జేఏసీ పిలుపుమేరకు వివోఏలు సమ్మె బాట పట్టారు. సమ్మెలో భాగంగా శనివారం వివోఏలు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకట్, శ్రీకాంత్, బ్రహ్మం, తదితరులు పాల్గొన్నారు.