WGL: ప్రజల సమస్యల పరిష్కారం కోసమే సీపీఐ పార్టీ పనిచేస్తోందని కొత్తగూడెం ఎమ్మెల్యే కొనంనేని సాంబశివరావు అన్నారు. నల్లబెల్లి మండలంలో జరిగిన సీపీఐ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.