BHNG: తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి, అమ్మవారికి ఊంజల్ సేవ కార్యక్రమాన్ని శాస్త్రోత్తంగా నిర్వహించారు. ఆలయ వేద పండితులు భక్తులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు భక్తులు కూడా పాల్గొన్నారు.