ADB: ఇచ్చొడ మండలంలోని నర్సాపూర్ గ్రామంలో గల దుర్గామాత మండపంలో నిర్వహించిన హారతికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మండప సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు. గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమని అనిల్ జాదవ్ పేర్కొన్నారు.