SDPT : రాష్ట్రంలో యూరియా కొరత నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి ముందుచూపు లేదని, రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన తెచ్చారని ఆరోపించారు. నంగునూరు మండలంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. యూరియా ఇవ్వని కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వమని అన్నారు.