మెదక్ పురపాలక సంఘం కొత్త కమిషనర్గా యరగాని నవీన్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో వెయిటింగ్లో ఉన్న ఆయనను ప్రభుత్వం కమిషనర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి స్థానంలో నవీన్ బాధ్యతలు చేపట్టారు. అందరి సహకారంతో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.