GDWL: జిల్లా కేంద్రంలోని జమ్ములమ్మ, పరశురాముడు ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం నిర్వహించిన సామూహిక దీపోత్సవానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమ్మవారి పల్లకి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన తెలిపారు.