NZB: కమ్మర్పల్లి మండలం హస కొత్తూర్ గ్రామంలో తాళం వేసిన రెండు ఇళ్లలో చోరీ జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం.. దుండగులు తాళాలు పగల గొట్టి బంగారం, వెండి చోరీ చేశారు. గ్రామానికి చెందిన ఆర్మూర్ నీలా ఇంట్లో తులం బంగారం, పక్కనే ఉన్న చీటిమేలా బాలయ్య ఇంట్లో 15 తులాల వెండి, 3 విలువైన గడియరాలు దొంగిలించారు. క్లూస్టం వేలిముద్రలను సేకరించింది.