KNR: ఇల్లందకుంట మండలంలోని రేషన్ కార్డు లబ్ధిదారులు అందరూ తప్పనిసరిగా e-KYC చేసుకోవాలని తహసీల్దార్ రాజమల్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. e-KYC పూర్తి చేయని వారి కోటా నిలిపివేయబడుతుందని తెలిపారు. మండలంలో ఇంకా 30 శాతం మంది లబ్ధిదారులు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందని, ఈ నెల 31లోపు రేషన్ షాపులో వేలిముద్రలు వేసి చేసుకోవాలన్నారు.