BHNG: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కోతుల బెడదకు సర్పంచ్ విజయలక్ష్మి చెక్ పెట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గ్రామంలోని కోతులను అడవులకు సురక్షితంగా శ్రీశైలం నల్లమల అడవుల ప్రాంతానికి తరలించారు. ప్రజలు ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు కోతుల దాడికి గురవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.