GDWL: అలంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లి మండలంలోని ఓ మైనర్ బాలికను మాయమాటలు చెప్పి ఆంధ్రప్రదేశ్ కు తీసుకువెళ్లిన కేసులో గద్వాల ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అనంతపురం జిల్లా హిందూపురాకి చెందిన వడ్డే వెంకటరమణకు 25 ఏళ్ల జైలు శిక్ష, రూ. 40 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి రవికుమార్ గురువారం తీర్పు చెప్పారు