MBNR: అడ్డాకుల మండలం బలీదు పల్లి గ్రామ శివారులో ఉన్న స్మశాన వాటికను కొందరు అక్రమార్కులు కబ్జా చేసే క్రమంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని స్మశాన వాటికను కాపాడాలని గ్రామ పంచాయతీ కార్యదర్శికి గ్రామస్తులు గురువారం వినతిపత్రం సమర్పించారు. వెంటనే స్మశాన వాటికను కబ్జా చేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.