Fire Accident: వారం కాకముందే నాచారంలో మరో అగ్ని ప్రమాదం
మల్లాపూర్ పారిశ్రామిక వాడలోని ఏకశిలా రసాయన కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ అయింది. అగ్ని మంటలు చెలరేగగానే కంపెనీలో పనిచేసే కార్మికులు భయంతో పరుగులు తీశారు. మంటలు అంటుకోగానే అందులో ఉన్న రసాయనపదార్థాలు కాలిపోయి విషవాయువులు వెలువడ్డాయి. వాటిని పీల్చిన ప్రజలు అస్వస్థతకు గురయ్యారు.
Fire Accident: హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.ఇటీవల నాచారం(Nacharam)లోని జేపీ పెయింట్స్ కంపెనీలో అగ్నిప్రమాదం(Fire Accident) జరిగి వారం కానేలేదు.. మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మల్లాపూర్ పారిశ్రామిక వాడలోని ఏకశిలా రసాయన కంపెనీ(Ekshila Chemical Company)లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. అగ్ని మంటలు చెలరేగగానే కంపెనీలో పనిచేసే కార్మికులు భయంతో పరుగులు తీశారు. మంటలు అంటుకోగానే అందులో ఉన్న రసాయనపదార్థాలు(Chemicals) కాలిపోయి విషవాయువులు వెలువడ్డాయి. వాటిని పీల్చిన ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాకపోతే అందులో పనిచేసే కార్మికులు అమ్మోనియా విషవాయువును పీల్చుకుని తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.
అమ్మోనియా ప్రాణాంతకం కావడంతో .. దానిని కంపెనీలో ఎలా వాడుతారని స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు కంపెనీకి పర్మిషన్ ఉందా? లేదా? అని స్థానిక కంపెనీ యాజమాన్యంపై అనుమానం వ్యక్తం చేశారు. శ్రామిక వాడ ఉన్నత అధికారులు స్పందించి ఏకశిలా కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఘటన గల కారణాలను తెలుసుకుంటున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ఎలా సంభవించింది అని ఆరా తీస్తున్నారు. అస్వస్థతకు గురైన కార్మికులను హుటాహుటిన ఆసుపత్రి(Hospital)కి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అయితే నాచారంలోనే వారంరోజులు తిరగకముందే మరో ఘటన చోటుచేసుకోవడంపై ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నా ఇలాంటి విషవాయువులున్న కంపెనీలకు పర్మిషన్లు ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడుతున్నారు.