కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా (Amit Shah) తెలంగాణ పర్యటన వాయిదా పడింది. ఖమ్మం(Khammam)లోగురువారం నిర్వహించాల్సిన భారీ బహిరంగ సభపై బిపర్ జాయ్ తుపాన్ (BeeperJoyTyphoon)ఎఫెక్ట్ పడింది. ఖమ్మం సభ ఏర్పాట్లను నిలిపివేయాలని రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. దీంతో సభ ఏర్పాట్లను నిలిపివేశారు. అమిత్ షా పర్యటన రద్దు కావడంతో పార్టీ శ్రేణులు డైలమాలో పడ్డారు. దీంతో కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారు. ఇదిలా ఉండగా ఈ సమయంలో సభ రద్దయితే శ్రేణులు డీలా పడతారని, అందుకే హైదరాబాద్ (Hyderabad) పర్యటన లేకుండా ఖమ్మం సభకు రావాలని తెలంగాణ బీజేపీ నేతలు అమిత్ షా కార్యాలయానికి రిక్వెస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. షా కార్యాలయం నుంచి ఇప్పటి వరకు ఈ పర్యటనపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
అమిత్ షా తొలుత ఈనెల 15వ తేదీన తెలంగాణ(Telangana) కు వస్తారని చెప్పారు. కానీ ఆ షెడ్యూల్ ను మార్చుకున్నారు. బుధవారం రాత్రి వరకు హైదరాబాద్ చేరుకుని బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అవడంతో పాటు సినీ దర్శకుడు రాజమౌళి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను కలవాల్సి ఉంది. ఆపై హైదరాబాద్ నుంచి బయల్దేరి భద్రాచలం (Bhadrachalam) రాములవారి దర్శనం చేసుకుని ఖమ్మం సభకు బయలుదేరాల్సి ఉంది. కానీ బిపర్ జాయ్ తుపాన్ ఎఫెక్ట్ కారణంగా షా తన పర్యటనను రద్దు చేసుకున్నారు.పార్టీ రాష్ట్ర నాయకత్వంలో మార్పులు చేర్పులు జరుగుతాయని జరుగుతన్న ప్రచారంతో పాటు రాబోయే ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఆయన దిశానిర్దేశం చేయాల్సి ఉంది.
ఖమ్మం (Khammam) సభ ద్వారా పార్టీ వీక్ గా ఉందని భావించిన వారికి కనువిప్పు కలిగేలా నిర్వహించాలని బీజేపీ భావించింది.దీంతో పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా మంచిర్యాల పర్యటన,సంగారెడ్డి (Sangareddy)లో మేధావులతో జరగాల్సిన అమిత్ షా సమావేశం చివరి నిమిషంలో రద్దు అయ్యింది. అలాగే మే 27న యోగా దినోత్సవ సన్నాహకా సభను ఆఖరి నిమిషంలో రద్దు చేసుకున్నారు షా. తాజాగా తుఫాన్ కారణంగా రేపటి ఖమ్మం సభ కూడా రద్దు అయ్యింది. ఇలా తెలంగాణలో అమిత్ షా పర్యటనల వరుస రద్దుతో బీజేపీ క్యాడర్ అయోమయంలో పడింది. ఈ క్రమంలో షా మరోసారి తెలంగాణ పర్యటనకు వస్తారా? వస్తే ఎప్పుడు? అనేది తెలియాల్సి ఉంది.