Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పలు విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన, రావాల్సిన ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన విమానాలను యాజమాన్యం రద్దు చేసింది. ఆపరేషన్నల్స్ కారణం చూపుతూ విమానాలను చివరి నిమిషంలో రద్దు చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులకు లోనయ్యారు. తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు 40 మంది ప్రయాణికులు చేరుకున్నారు. విమానాలు క్యాన్సిల్ అయ్యాయని ఎయిర్‌లైన్స్ సంస్థ సిబ్బంది ప్రకటించారు. దీంతో ప్రయాణికులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. చివరి నిమిషంలో క్యాన్సిల్ చేస్తే ఎలా అంటూ నిలదీశారు.
చదవండి : Goldprices : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన ధరలు
ప్రయాణికులను శాంతింపజేసిన సిబ్బంది.. డబ్బులు తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. డబ్బులు వెంటనే రీఫండ్ చేశారు. అయితే ఉన్నట్లుండి లాస్ట్ మినిట్‌లో విమానం రద్దు కావడంతో ప్రయాణికులు నిరాశతో వెనుదిరిగారు. హైదరాబాద్ నుండి తిరుపతి, బెంగుళూరు, వైజాగ్, మైసూరు వెళ్లే విమానాలు, అక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రావాల్సిన విమానాలు రద్దు అయ్యాయి. అయితే చివరి నిమిషంలో విమానాలు రద్దు చేయడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. విమానాలు రద్దు అయితే ముందుగానే ప్రయాణికులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. మెసేజ్ రూపంలో ప్రయాణికులకు ముందుగానే సమాచారం ఇవ్వాలి. కానీ ఎయిర్‌పోర్టుకు వచ్చిన తర్వాత విమానాలు రద్దు అయినట్లు ఎయిరిండియా యాజమాన్యం ప్రకటించడంతో ప్రయాణికులు భగ్గుమన్నారు.