PDPL: రైతులు వరి ధాన్యాన్ని 17 శాతం లోపు తేమ వచ్చాక మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఇవాళ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఓ ప్రకటనలో తెలిపారు. పొలం నుంచి నేరుగా కాకుండా ముందుగా బాగా ఆరబెట్టాలని, రాత్రిపూట ప్లాస్టిక్ కవర్లు కప్పి తేమ పెరగకుండా చూడాలని చెప్పారు. నాణ్యమైన ధాన్యం తీసుకువస్తే అదే రోజు కాంటా వేసి మిల్లులకు తరలిస్తామని తెలిపారు.