MNCL: గణేష్ మండపాల నిర్వాహకులు, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు మందమర్రి CI శశిధర్ రెడ్డి మంగళవారం పలు సూచనలు చేశారు. మండపాలను విద్యుత్ లైన్ల క్రింద, ట్రాన్స్ఫార్మర్ల దగ్గరగా ఏర్పాటు చేయరాదన్నారు. మండపాల్లో ELCB, MCB ఏర్పాటు చేయాలన్నారు. వైరింగ్‌ను లైసెన్స్ పొందిన ఎలక్ట్రీషియన్ ద్వారా చేయించాలన్నారు. జనరేటర్ వాడితే రిటర్న్ కరెంట్ రాకుండా జాగ్రత్త పడాలన్నారు.