ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ మడవి కిషన్, ఉపసర్పంచ్ దండ్ల దత్తు లను సోమవారం గ్రామ మున్నూరు కాపు సంఘం సభ్యులు ఘనంగా సన్మానించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. గ్రామంలో ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలన్నారు.