KMR: నాగిరెడ్డి పేట మండలం గోపాల్ పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి అర్చన రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు నెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్ తెలిపారు. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అర్చనఈ నెల 31 నుంచి జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు చెప్పారు. ఇటీవల జరిగినజిల్లా స్థాయిలో ఆమె ప్రతిభ కనబరిచినట్లు పేర్కొన్నారు.