ASR: జీ.మాడుగుల మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కొత్తపల్లి జలపాతాన్ని ఈనెల 24నుండి 27వ తేదీ వరకు మూసి వేయడం జరుగుతోందని ఐటీడీఏ పీవో వి.అభిషేక్ గురువారం తెలిపారు. జలపాతం మూసివేసి ఆధునీకరణ పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. నాలుగు రోజులు పర్యాటకులను ప్రవేశం రద్దు చేయాలని కొత్త పల్లి జలపాతం సిబ్బందిని ఆదేశించారు. పర్యాటకులు గమనించి సహకరించాలని కోరారు.