ASR: కలెక్టర్ దినేష్ కుమార్కు 2024 సంవత్సరానికి బెస్ట్ ఎలెక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డ్ గురువారం లభించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత ఏడాది ఓటర్ల జాబితా తయారీలో, సమ్మరీ రివిజన్లో విశేష కృషి చేసి ఓటర్ల జాబితా తయారీకి పలు సూచనలు, నూతన ఓటర్లను చేర్పించడం, అనర్హులను తొలగించడం తదితర అంశాలపై ఉత్తమ అవార్డు లభించింది.