MDK: మండలం పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రామ్మోహన్ ఆధ్వర్యంలో అన్ని పార్టీల రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి పార్టీల నాయకులకు అవగాహన కల్పించారు. ఎన్నికల నియమ, నిబంధనల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రహీం, జోనల్ ఆఫీసర్స్ రామకృష్ణ, వరదరాజులు, ఎంపీఓ వెంకటేశ్వర్లు, ఎఎస్సై సదాశివరావు తదితరులు ఉన్నారు.