KMM: సర్పంచ్ పదవులకు పోటీ చేసే అభ్యర్థులు మైకు పర్మిషన్ కోసం మీసేవలో చలానా చెల్లించి MRO కార్యాలయంలో అందజేసి పోలీస్ ద్వారా ANOC తీసుకోవాలని సీఐ మధు అన్నారు. శుక్రవారం మధిరలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నుంచి వేతనం తీసుకునే ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.