KNR: హుజూరాబాద్ మండల విద్యాధికారి పై పాఠశాల విద్య కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ మెంబర్ కొలుగూరి సూర్య కిరణ్ తెలిపారు. వరుసగా విద్యాశాఖ ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎంఈవో గోపాల్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు పై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు.