TG: గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే లేరని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫునే ఐదారుగురు పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఉచిత బస్సు, ఉచిత పథకాలు ప్రజలకు బాగా నచ్చాయని వెల్లడించారు. ఏపీ, తెలంగాణ మధ్య విభేదాలు ఏమీ లేవని, కలిసిమెలిసి పనిచేస్తాయని ఈ సందర్భంగా తెలిపారు.