E.G: ప్రజా సమస్యలపై పోరాడి పార్టీని బలోపేతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం రాజమండ్రి సీపీఐ కార్యాలయంలో జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ శతాబ్దిక పోరాట గాథలు, ఉద్యమాల్లో చేసిన త్యాగాలను స్మరించుకునే విధంగా భారీ ఎత్తున ప్రజలను సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.