ములుగు జిల్లాలోని ఆయా మండల కేంద్రాల్లో గల ఎంపీడీవో కార్యాలయాల వద్ద ఎన్నికల ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే ఓటర్లకు, అత్యవసర సేవలో పనిచేసే ఓటర్లకు, పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు