KNR: రామచంద్రపురం కాలనీలో జరుగుతున్న డ్రైనేజీ సీసీ రోడ్డు పనులను శుక్రవారం నగర మేయర్ సునీల్ రావు, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. కాలనీలో ఏమైనా సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కాలనీవాసులకు తెలిపారు. వారి వెంట కార్పొరేటర్ జయశ్రీ వేణు, అధికారులు పాల్గొన్నారు.