MLG: జిల్లాలో చోరీలు, ఆర్థిక నేరాలపై వచ్చిన ఫిర్యాదులకు న్యాయం జరిగేలా దర్యాప్తు చేయాలని ఎస్పీ శబరీష్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమీక్షా సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలను సందర్శించి గ్రామ సభలు నిర్వహించాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్, మెడికల్ క్యాంపు నిర్వహించాలని సూచించారు.