WGL: వరంగల్ కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు వరంగల్ కలెక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవచ్చన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు ప్రజావాణికి తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.